టిడిపి సభ్యత్వ నమోదులో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 9, 10 వార్డుల్లో ఆదివారం టిడిపి సభ్యత్వం, ఓటరు నమోదు కార్యక్రమం వేర్వేరుగా నిర్వహించారు. 9, 10 వార్డుల్లో టిడిపి నాయకులు ఒమ్మి రాజు, మద్దిల రాజశేఖర్ ఆధ్వర్యాన సంజరుగాంధీ కాలనీ, ఆదర్శనగర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని ప్రారంభించారు. టిడిపి అభిమానులు, సానుభూతి పరులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎస్‌సి సెల్ అధ్యక్షులు బుడుమూరు గోవిందు, బాదరు బాలరాజు, గాడు అప్పలనాయుడు, కేతా సత్యనారాయణ, జి.సత్యనారాయణ, మద్దిల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.










