ప్రజాశక్తి-బాపట్ల: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సైతం తుంగలోతొక్కి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసే విధంగా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే న్యాయానికి సరైన తీర్పిస్తారన్నారు. ఆ తీర్పుతో జగన్మోహన్‌రెడ్డి చరిత్ర హీనులవుతారన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు తానికొండ దయాబాబు, గొలపల శ్రీనివాసరావు, ఫరీద్ మస్తాన్, మందపాటి ఆంద్రే య, యలమంద, సూరగాని శేఖర్, కుట్టుబో యిన రమేష్‌బాబు, తాత చిన్నబాబు, కొల్లూరు వెంకట రావు, వేమవరపు విజరు, బొడ్డు గోవిందు, షేక్ షాకా, పరిశా రమేష్ గౌడ్, బూర్లే రామసుబ్బా రావు, షేక్ మస్తాన్ వలి, ధార అశోక్, దేశిరాజు సాయి, గోపి, కిషోర్, సలగల రాజ, కిరణ్, వెంకట స్వామి, బాలసుందర్, నక్కల శీతాలు, పసుపులేటి శివ, దమ్మాలపాటి రాఘవేంద్ర పాల్గొన్నారు.
కనిగిరి: టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టిడిపి శ్రేణులు స్థానిక టిడిపి కార్యాల యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో పాటు టిడిపి శ్రేణులు, తెలుగు మహిళలు రిలే నిరాహార దీక్షలో తొలిరోజు కూర్చుకున్నారు.
ఈ దీక్షలను ఉద్దేశించి డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామిక మని, కడిగిన ముత్యం వలె బయటకు వస్తారని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ ఉగ్ర ఆదేశాల మేరకు కనిగిరి పట్టణంతోపాటు ఆరు మండలాలోని గ్రామాలలో నిరసన తెలపటంతోపాటు సర్వమత ప్రార్థనలను టిడిపి శ్రేణులు చేపట్టారు. బాబుతో నేను సైతం అనే నినాదాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు నంబుల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
సిఎస్ పురం: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి క్షేమంగా బయటకు రావాలని మండల టిడిపి నాయకులు పలు దేవాలయాల్లో బుధవారం పూజలు నిర్వహించారు. కనిగిరి టీడీపీ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండ ల టిడిపి అధ్యక్షులు బి వెంగయ్య అధ్వర్వంలో టీడీపీ నాయకులు సిఎస్ పురంలోని చంద్ర మౌళీ శ్వర కామాక్షమ్మ, పెద్దమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో బొమ్మన బోయిన వెంగయ్య, మాలకొండయ్య, బత్తుల వెంకటాద్రి, తోట చిన్న, పాములపాటి నరసయ్య, శ్రీనివాసులు, కోటిరెడ్డి, శ్రీరాములు, ఇండ్ల శ్రీనివాసు లు, కె వెంకటస్వామి, కె వెంకట కొండయ్య, షేక్ షాను, యేసు, వెంకటరామయ్య, బాలయ్య, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెలిగండ్ల: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి క్షేమంగా బయటకు రావాలని మండల టిడిపి నాయకులు పలు దేవాలయాల్లో, మసీదులు, చర్చీలలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, మండల క్లస్టర్ కారంపూడి వెంకటేశ్వర్లు, మైనారిటి సెల్ అధ్యక్షులు షేక్ మజహర్, వాలిచర్ల శ్రీను, చిన్న, బత్తుల తిరుపతిరెడ్డి, నాసర్, సెల్‌షాపు మస్తాన్, ఆర్‌ఎంపి వలి, సిద్దయ్య, మౌలానా, బైసాని సుబ్రమణ్యం, ఖాజావలి, పల్నాటి కోటిరెడ్డి, సోబిరాల వేణు గోపాల్, మండల ఆర్యవైశ్య నాయకులు సోమిశెట్టి సుబ్బారావు, నరేంద్ర, బాలరాజు, మాలకొండయ్య, పండు, సలోమన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.










