టిడిపి రిలే నిరాహార దీక్ష ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద బుధవారం పార్టీ నాయకులు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నియోజవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కావలి పట్టణ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో దీక్షలో కూర్చున్నారు. మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మొదటి రోజు దీక్షలో మాలేపాటి సుబ్బానాయుడు కావలి పట్టణంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. సిఎం డౌన్ డౌన్.., టిడిపి వర్థిల్లాలి.. మాలేపాటి నాయకత్వం వర్థిల్లాలి'' అంటూ కార్యాలయ ప్రాంగణం మారు మోగింది. ఈ దీక్షలలో టిడిపి నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు, బొట్లగుంట శ్రీహరినాయుడు, తటవర్తి వాసు, పోతుగంటి అలేఖ్య, మన్నవ రవిచంద్ర, మంచాల ప్రసాద్, మొగిలి కల్లయ్య, కుల్లూరు అశ్విని, ఇబ్రహీం, పల్లపు కుమార్, మేడికొండ సుకుమార్, షేక్.రఫీ, షేక్.మస్తాన్, చిట్టా బత్తిన మాల్యాద్రి, మక్కి శ్రీహరి, నేలపాటి మాల్యాద్రి, సురేంద్ర, నల్లమోతుల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.










