కోటంరెడ్డితో మాట్లాడుతన్న సిపిఎం నాయకులు
టిడిపి పోరాటానికి మద్దతు తెలిపిన సిపిఎం
ప్రజాశక్తి-నెల్లూరు:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్ చేసి.. రిమాండ్ కి పంపడం పై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు నిరసన, ధర్నాలు చేస్తూ న్నారు. ఈ క్రమంలో గడిచిన రెండు రోజుల నుంచి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. పోలీసులు గృహ నిర్భందాలను అధిగమించి ధర్నాలు, నిరసనలు తన దైన శైలిలో చేస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఆయన స్వగృహంలో సిపిఎం జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ న్యాయపోరాటంలో భాగంగా టిడిపి చేసే నిరసన కార్యక్రమాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, రాజగోపాల్, మోహన్ రావ్ తదితరులున్నారు.










