Sep 12,2023 21:04

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నేతలు మంగళవారం ఒంగోలులోని బందావనం ఫంక్షన్‌ హాలులో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, సహచర ఇంచార్జ్‌ లతో కలిసి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. త్రోవగుంట వద్దనున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.