ప్రజాశక్తి - భట్టిప్రోలు (వేమూరు)
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేమూరులో మంగళవారం 7వ రోజు మంగళవారం నిరాహార దీక్ష చేశారు. దీక్షలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. స్కిల్ స్కాంలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా సిఎం జగన్మోహన్ రెడ్డి కావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబును అరెస్టు చేయించారని ఆరోపించారు. చంద్రబాబుకు సంఘీభావంగా చేస్తున్న శాంతియుత ధర్నాలను కూడా పోలీసులు నిలువరిస్తూ జగన్ రెడ్డి భజన చేస్తున్నారని అగ్రహ వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం లేదని అన్నారు. జగన్ రెడ్డి అరాచకాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. చంద్రబాబును విడుదల చేసేంతవరకు దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, తూనుగుంట్ల సాయిబాబా పాల్గొన్నారు.










