సత్యం రెడ్డిని పరామర్శిస్తున్న మాండ్ర
టిడిపి నేతను పరామర్శించిన మాండ్ర
ప్రజాశక్తి - పగిడ్యాల
అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి నాయకుడు పుల్యాల సత్యం రెడ్డిని టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానంద రెడ్డి సోమవారం పరామర్శించారు. పగిడ్యాల గ్రామానికి చెందిన పుల్యాల సత్యంరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విష యం తెలుసుకున్న మాండ్ర శివానంద రెడ్డి సత్యం రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్యం పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజశేఖర్ రెడ్డి, సిరి గౌడ్, మహేష్ నాయుడు, జయ సూర్య, పగడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.










