ప్రజాశక్తి-బుచ్చయ్యపేట:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండలంలో సంబరాలు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేపాడ చిరంజీవిరావు విజయం సాధించడంతో జోరు మీద ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబు, మండల తెలుగుదేశం నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు గోకవాడ కోటేశ్వరరావు, మాజీ సర్పంచులు డొంకిన అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ ఎంవివి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి వియ్యపు అప్పారావు, మాజీ సర్పంచ్లు కోట సత్యనారాయణ, మళ్రెడ్డి బుజ్జి, తమరాన సింహాద్రి అప్పుడు, దొడ్డి కిషోర్, డిసిసిబిమాజీ డైరెక్టర్ కోరుకొండ రవికుమార్, దాసరి సత్యారావు, ఎంపీటీసీ కంచిపాటి శ్రీనివాసరావు, సర్పంచ్ ముచ్చకర్ల తాతీలు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్.రాయవరం:ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి అనురాధ గెలుపొందడంతో టిడిపి నాయకులు గురువారం రాత్రి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. సీనియర్ టిడిపి నాయకులు కందులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పట్టభద్రుల ఎన్నికలలో ఉద్యోగులు జగన్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. క్రాస్ ఓటింగ్ వేసి అనురాధను గెలిపించడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










