
ప్రజాశక్తి -నక్కపల్లి :మండలంలోని ఉద్దండపురం లో శుక్రవారం భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టిడిపి విడుదల చేసిన మహాశక్తి మేనిఫెస్టో పై టిడిపి నేతలు ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజలకు అన్ని విధాల మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైబోయిన రమణ, అప్పలరాజు, రమా కుమారి తదితరులు పాల్గొన్నారు.