Sep 26,2023 00:42

నక్కపల్లిలో కరపత్రాలు ఇస్తున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని గొడిచెర్ల గ్రామంలో సోమవారం టిడిపి శ్రేణులు బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైబోయిన రమణ, అల్లు అప్పారావు, వారా గాంధీ, కోడాలి రామకృష్ణ, కొంత సతీష్‌, మొల్లి నాగరాజు, కొల్లి అప్పలకొండ, కురందాస్‌ రమణ, బాబు రావు,బాబురావు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం:మండల కేంద్రంలో బాబుతో నేను కార్యక్రమాన్ని గ్రామ టీడీపీ నాయకులు నిర్వహించారు. మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం ఆధ్వర్యంలో గ్రామ నాయకులు బాబుతో నేను కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్‌ సీనియర్‌ నాయకులు కందులు వెంకటేశ్వరరావు, గుర్రం రామకృష్ణ, వమ్మవారం మాజీ ఎంపిటిసి బుజ్జి, కోన రామ్మోహన్‌రావు, మంచాల నానాజీ, లక్ష్మణరావు పాల్గొన్నారు.
ములగాడ: చంద్రబాబును అరెస్టును చేయడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు, 58వ వార్డు కోరమండల్‌ గేట్‌ వద్ద టిడిపి ఆధ్వర్యంలో నిరసనలో మాట్లాడుతూ, వైసిపి దుర్మార్గపు కక్షపూరిత చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారన్న విషయాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో వార్డు టిడిపి అధ్యక్షడు కోరాడ శ్రీను, ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరిలోవ : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు ఆధ్వర్యంలో సోమవారం 'బాబుతో నేను' కరపత్రాలను పంపిణీ చేసారు. ఆరిలోవ తోటగరువు, బాలాజీనగర్‌ పరిసరప్రాంతాల్లో టిడిపి నేతలు ఇంటింటికి వెళ్ళి అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరించారు. టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, గాడి సత్యం, పోలారావు, ఏడువాక సన్యాసిరావు, రాజారావు, తాతారావు, గణేష్‌ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ (విశాఖ) : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, సోమవారం సాయంత్రం నగరంలో టిడిపి కార్యకర్తలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. టిడిపి కార్యాలయం నుంచి సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రి మీదుగా ఎల్‌ఐసి దరి అంబేద్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్పటికే భారీ ఎత్తున మోహరించి ఉన్న పోలీసులు టిడిపి నాయకులతో సహా అనేకమందిని అరెస్ట్‌ చేసి, పోలీస్‌ బ్యారెక్స్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, బండారు అప్పలనాయుడు, పాశర్ల ప్రసాద్‌, ఒలిశెట్టి తాతాజీ, ఎంవి.ప్రణవ్‌ గోపాల్‌, సర్వసిద్ధి అనంతలక్ష్మి, సుజాత తదితరులు ఉన్నారు.
అనకాపల్లి:అబద్ధాల పుట్ట, కళ్ళుండి చూడలేని కబోదిలా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. స్థానిక రింగు రోడ్లో సోమవారం కళ్ళకు గంతలు, చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్ళ ముందు నిజాయితీగా స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన 40 కేంద్రాలు సజీవంగా కనబడుతుండగా, బొత్స సత్యనారాయణకు కనబడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాయకులు డాక్టర్‌ నారాయణరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, ధనాల విష్ణు చౌదరి పాల్గొన్నారు.
కశింకోట : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జైలు నుండి విడుదల కావాలని కోరుతూ కశింకోట మండలం పేరాంటాలపాలెం గ్రామంలో శారదా నది ఒడ్డున శివాలయం వద్ద సోమవారం పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ టిడిపి నాయకులు గొంతిన శ్రీనివాసరావు, కాయలు మురళి, ఉగ్గిని రమణమూర్తి, బుదిరెడ్డి గంగయ్య, పాల్గొన్నారు.