Sep 25,2023 01:11

విశాఖలో జల దీక్ష చేస్తున్న నాయకులు

భీమునిపట్నం : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ స్థానిక టిడిపి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 15వ రోజుకు చేరాయి. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు, ఆనందపురం మండలం నాయకులు పాల్గొన్నారు.
గాజువాక : పాత గాజువాకలో టిడిపి చేస్తున్న నిరసన దీక్షకు జనసేన, సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు, సిపిఐ కార్పొరేటర్‌ ఏజే స్టాలిన్‌, టిడిపి కార్పొరేటర్లు బొండా జగన్‌, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాలనాయుడు, పులి వెంకటరమణారెడ్డి, నాయకులు ప్రసాదుల శ్రీనివాస్‌, జనసేన కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డి, నాయకులు గడసల అప్పారావు, గంధం వెంకట్రావు, సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
పెందుర్తి : 94వ వార్డు వేపగుంట కూడలి వద్ద జనసేన, టిడిపి నాయకుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, బల్ల శ్రీనివాస్‌, పి.శ్రీనివాసరావు, రాపర్తి కన్నా, శానాపతి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం: సింహాచలంలో టిడిపి వార్డు అధ్యక్షుడు పంచదార శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం కాగడాల ప్రదర్శనను తలపెట్టారు. వీరి ప్రయత్నాన్ని గోపాలపట్నం పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను హౌస్‌ అరెస్టు చేశారు.
యలమంచిలి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా యలమంచిలి మెయిన్‌రోడ్డుపై చేపట్టిన రిలేనిరాహార దీక్ష శిబిరంలో కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు కొలుకులూరి విజయబాబు, రాజాన సూర్యనాగేశ్వరరావు, నారాయణమ్మ, రాష్ట్ర శెట్టిబలిజ సాధికార కన్వీనర్‌ కుడుపూడి సత్తిబాబు, యాత కన్వీనర్‌ వనుము శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు పాండురంగ, ఇత్తంశెట్టి రాజు, గొర్లె నానాజీ, రమణబాబు, కౌన్సిలర్‌ మజ్జి రామకృష్ణ, జనసేన రాజాన సోమునాయుడు, యాండ్రఅప్పలనాయుడు, కుందిరి అప్పలరాజు, కర్రి రమణ, నోట్ల అప్పలనాయుడు, కరణం రవి, రమణబాబు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : 19వ వార్డు పెద జాలారిపేట కార్పొరేటర్‌ నొల్లి నూకరత్నం, బైరెడ్డి పోతన్నల ఆధ్వర్యంలో మత్స్యకారులు సముద్రంలో బోట్లుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు జివి.రామచంద్రరావు, తెడ్డు రాజు, దోడ చిరంజీవి, పిల్లా నూకన్న, ఒలిశెట్టి చిన ఎల్లయ్య, ఒలిశెట్టి సత్యారావు పాల్గొన్నారు.
టిడిపి నాయకుల అరెస్ట్‌
విశాఖ కలెక్టరేట్‌ : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్ష ముగిసే సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును పోలీసులు హరిస్తున్నారంటూ నేతలు మండిపడ్డారు. సాయంత్రం బీచ్‌ రోడ్డులో తలపెట్టిన తెలుగు మహిళల నారీ భేరికి హాజరైన పలువురిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ బ్యారెక్స్‌ వద్దకు తరలించారు. అరెస్టయిన వారిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్‌, కార్యదర్శి లొడగల కృష్ణ ఉన్నారు. అరెస్టులకు ముందు నిరాహార దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు.