Sep 24,2023 00:37

నర్సీపట్నంలో నిరసన చేపడుతున మహిళా నేతలు

ప్రజాశక్తి - యంత్రాంగం:టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులకు నిరసనగా టిడిపి నేతలు నిరసనలు కొనసాగించారు. అనకాపల్లి, విశాఖలో జిల్లాల్లో ర్యాలీలు చేపట్టారు
నర్సీపట్నంటౌన్‌:చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో స్థానిక శివాలయం, మరిడిమాంబ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అబీద్‌ సెంటర్‌ లో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ పురవీధుల్లో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ,రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబును అరెస్టు చేసారనీ ఆగ్రహించారు. స్కిల్‌ డెవలెప్మెంట్‌ స్కామ్‌ అంటూ ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. స్కిల్‌ డెవలెప్మెంట్‌ శిక్షణతో లక్ష మంది యువతి, యువకులు ఉద్యోగాలు పొందారని తెలియజేశారు.
గొలుగొండ: మండలం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో చీడిగుమ్మలలో ర్యాలీ చేపట్టారు. గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కె.ఎల్లవరం సర్పంచ్‌ కొల్లు రాంబాబు, చీడిగుమ్మల టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు కామరెడ్డి గోవింద్‌, చోద్యం సర్పంచ్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
నలుపు బెలూన్లతో టిడిపి నిరసన
అనకాపల్లి : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా శనివారం టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్‌ కెకెవిఎ.నారాయణరావు, మాదంశెట్టి నీలబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, కాండ్రేగుల సత్యనారాయణ, ధనాల విష్ణు చౌదరి, మళ్ల గణేష్‌, కుప్పిలి జగన్‌ జనసేన నాయకులు దూలం గోపి, తాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పోస్ట్‌ కార్డు ఉద్యమం
వడ్డాది : బుచ్చయ్యపేట మండలం బంగారమెట్ట గ్రామంలో పోస్ట్‌ కార్డు ఉద్యమం శనివారం చేపట్టారు. చంద్రబాబు నిర్దోషి అని పోస్ట్‌ కార్డులను పంపించే కార్యక్రమం చేశారు. అనంతరం వినాయక మండపం వద్ద చంద్ర బాబు త్వరగా విడుదల కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లపు జగ్గారావు, నాయకులు దొండా శ్రీను, తమరాన దాసు, సాయం శేషు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 14వ రోజుకు చేరాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాసర్ల ప్రసాద్‌, గంటా నూకరాజు, జి.ఆనందబాబు, కార్పొరేటర్లు గాడు చిన్నికుమారిలక్ష్మి, పిల్ల మంగమ్మ, వరహానరసింహం తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : జివిఎంసి 97వ వార్డు సుజాతనగర్‌ కూడలి వద్ద టిడిపి, జనసేన నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షనుద్దేశించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనపై ఎన్ని స్కాములు ఉన్నాయో బయటకు తీస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దాట్ల మధు, శానాపతి శంకరరావు, పి.శ్రీనివాసరావు, జనసేన నాయకులు మధు, పార్వతి పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో 27, 41, 42 వార్డుల నాయకులు, కార్యకర్తలు కళ్లకు నల్లని వస్త్రాలు కట్టుకొని నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు. నాయకులు అల్లూరి సత్యనారాయణరెడ్డి, కె.వెంకట రమణారావు, ఐ.మధుబాబు పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద నేరస్తుడు జగన్‌ : గంటా
దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్‌ రెడ్డి అని టిడిపి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనలాగే అందర్నీ జైలుకు పంపించాలని జగన్‌ భావిస్తున్నారన్నారు. తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకు లోకేష్‌ ఢిల్లీలో ఉంటే భయపడి దాక్కున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్‌, ఉత్తర ఇంచార్జ్‌ చిక్కాల విజరు పాల్గొన్నారు.