Jun 11,2023 17:59

సేకరించిన మొత్తాన్ని బాధితునికి అందజేసిన మీనాక్షి నాయుడు

టిడిపి నేతకు కార్యకర్తలు ఆర్థిక సాయం

ప్రజాశక్తి - ఆదోని

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిడిపి నాయకుడి కుటుంబానికి ఆ పార్టీ కార్యకర్తలు నుండి సేకరించిన మొత్తం రూ. 50 వేలను బాధితుడికి ఆదోని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆదివారం అందజేశారు. మూడు నెలల క్రితం మోటార్‌ సైకిల్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇబ్బంది పడుతున్న జాలమంచి గ్రామంకు చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు చిదానందను మీనాక్షి నాయుడు మాట్లాడుతూ పరామర్శి ంచామన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడుతూ చిదానంద ఆరోగ్య పరిస్థితి గమనించి నాయకులు, కార్యకర్తలు తరుపున ఆర్థిక సహాయం చేశామన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అదేవిధంగా కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన అదే గ్రామానికి చెందిన చాకలి తిక్కన్నకుమారుడు వివాహానికి రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని పరామర్శించామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బుద్ధారెడ్డి, శివప్ప, బంగారయ్య, లక్ష్మీ నారాయణ, జయరామ్‌, అయ్యన్న, తిమ్మప్ప, రవి, గోవిందు, హుసేని, షణ్ముఖ, బాలస్వామి, రామంజిని పాల్గొన్నారు.