Dec 28,2022 21:38

ఫొటో: చికిత్స పొందుతున్న పైడి హర్ష

టిడిపి నేత ఆత్మహత్యాయత్నం
ప్రజాశక్తి-కావలి : బోగోలు మండలం కడనూతల గ్రామానికి చెందిన తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పైడి హర్ష బుధవారం కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇంటి ఎదురుగా పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందును తాగడం గమనించిన స్థానికులు కావలి పట్టణ ప్రభాకర్‌ నాయుడు హాస్పిటల్‌లో చేర్పించగా, అక్కడ చికిత్స పొంది, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ సందర్భంగా హర్షను కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, టిడిపి జాతీయ కార్యదర్శి బీద రవిచంద్రలు పరామర్శించారు.
వైసిపి ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌రెడ్డి వేధింపులు తాళలేక ఎంఎల్‌ఎ నివాసం ఎదుట పురుగుల మందు తాగినట్లు బాధితుడు తెలిపాడు. ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కక్షపూరితంగా రౌడీషీట్‌ ఓపెన్‌ చేయించాడని ఆరోపించాడు. గతకొద్ది రోజులుగా తనను వివిధ కారణాలతో వైసిపి నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్దకి చేరుకొని హర్షని పలువురు టిడిపి నాయకులు పరామర్శించారు.