నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
టిడిపి నాయకురాలి మృతికి మాజీ మంత్రి సంతాపం
ప్రజాశక్తి - చాగలమర్రి
మండలంలోని చిన్నబోధనం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకురాలు బోయపాటి పెద్దక్క(65) మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు.బుధవారం పెద్దక్క అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గ్రామానికి చేరుకొని ఆమె మృత దేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.సంతాపం తెలిపిన వారిలో లుక్కాని ఓబులేసు,ఐటిడిపి నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు శగ్నారెడ్డి,బోయపాటి శ్రీనివాసులు,రమణారెడ్డి తదితరులు ఉన్నారు.










