ప్రజాశక్తి- నెల్లిమర్ల : చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో నెల్లిమర్ల దీక్షా శిబిరం నుంచి కొత్తపేటలో ఉన్న సత్యదేవుని ఆలయం వరకూ సోమవారం 4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్, పతివాడ అప్పలనారాయణ, టిడిపి నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్, కర్రోతు సత్యనారాయణ, మహంతి శంకరరావు, నాయకులు గేదెల రాజారావు, చింతపల్లి వెంకటరమణ, గొర్లి జగన్నాథం, పతివాడ తమ్మినాయుడు, లెంక అప్పలనాయుడు, అవనాపు సత్యనారాయణ, గురాన చక్రధర్, అట్టాడ శ్రీధర్, కాళ్ల రాజశేఖర్, పోతల రాజప్పన్న, తాడ్డి సత్యనారాయణ, నల్లం శ్రీను, గురాన అసరినాయుడు, కింతాడ కళావతి, కాళ్ల సత్యవతి, పసుపులేటి గోపి, దనాన రామ్మూర్తి, దంగా భూలోకు, రాకేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాజాం: స్థానిక టిడిపి కార్యాలయం ముందు మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 6 వార్డులకు సంభందించిన టిడిపి నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. రాజాం టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాసపు రమేష్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు టంకాల కన్నం నాయుడు, పొట్నూరు సోమశేఖర్, అడపా శ్రీను, పొట్నూరు గౌరీనాయుడు, వడ్డీపిళ్లి రమణ, కొంపల్లి కిరణ్ కుమార్, బీసీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి పిల్లా సత్యం నాయుడు, తెలుగుయువత నియోజకవర్గం అధ్యక్షుడు శాసపు రాజేష్, కెంబూరు రామకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెర్లాం రూరల్: స్థానిక వెంకటేశ్వర ఆలయం ఆవరణలో పార్టీ అధ్యక్షులు వెంకట్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షలో బేబినాయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు, వెంకటేష్, సింహాచలం, బోనేలా రూప, శంకరరావు, శేసిబుషన్, యుగంధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మెంటాడ: మండలంలోని గుర్లతమ్మిరాజుపేటలో సోమవారం టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ చొక్కాకు సన్యాసి నాయుడు, కొరిపల్లి రాజు, తాతా సాహెబ్, సిరిపురం తిరుపతి, రొంగలి సూర్యనారాయణ, గొర్లె అప్పలనాయుడు, పైల రాము తదితరులు పాల్గొన్నారు. గరివిడి : చీపురుపల్లి పట్టణంలో సోమవారం గరివిడి పట్టణ టిడిపి నాయకులు రెడ్డి గోవింద, తూట శ్రీనివాసరావు, వైగాల సత్యం, తదితరులు దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పైల బలరాం, సారేపాక సురేష్ బాబు, మహంతి రమణ మూర్తి, బలగం వెంకట రావు, మహంతి అప్పల నాయుడు,మండల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. రామభద్రపురం: చంద్రబాబుపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమని రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి, స్థానిక మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ చింతల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో జరగని అవినీతిని జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో సర్పంచ్ రవ్వ ఈశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు కరణం విజయ భాస్కరరావు, నేతలు పూడి రామినాయుడు,శ్రీను పాల్గొన్నారు. విజయనగరం కోట: స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయం వద్ద విజయనగరం మండల పరిధిలోని ద్వారపూడి, దుప్పాడ నాయకులు చేపట్టిన రిలే దీక్షలకు సోమవారం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు మద్దతు తెలిపారు. సాయంత్రం వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు, విజయనగరం మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, కర్రోతు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. మేము సైతం బాబుతో కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు సంతకాలు సేకరణ చేసిన పోస్ట్ కార్డులను కంటోన్మెంట్ తపాలా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బాక్స్‌లో వేశారు. బొబ్బిలి: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పట్టణంలోని టిడిపి దీక్షలు 13వ రోజు సోమవారం కొనసాగాయి. దీక్షలను టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన ప్రారంభించారు. దీక్షల్లో ఎం.బూర్జవలస, గున్నతోటవలస, ఎం.పనుకువలస, కొత్తపెంట గ్రామాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.










