
ప్రజాశక్తి-గన్నవరం : విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరిన నారా లోకేష్ వెంట వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, దేవినేని ఉమామహేశ్వరరావు ను కార్లకు అక్రమంగా బారికేడ్లు పెట్టీ పొట్టిపాడు వద్ద పోలీసులు అడ్డు కోవడం శుక్రవారం వివాదస్పదమైంది. హనుమాన్ జంక్షన్ సిఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటుగా వెళుతున్న టిడిపి వాళ్ళ కార్లను నిలిపివేసి నాయకులు వెళ్లడానికి వీలు లేదని అడ్డం చెప్పారు. బారికెడ్లు పెట్టి మమ్మల్ని నిర్బంధిం చాలని ప్రయత్నిస్తున్నారా....అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసులపై ఆగ్రహించారు. ఒక సందర్భంలో బారికేట్లను తోసి వేయడానికి ప్రయత్నించారు. పోలీ సులు వారించారు. అనంతరం నాయకులు వెనుతిరిగి వెళ్లిపోయారు. వైసీపీ తీరును యార్లగడ్డ వెంకట్రావు తప్పు పట్టారు.