సంతాపం తెలుపుతున్న టీడీపీ నాయకులు
టిడిపి నాయకుడు మృతి
ప్రజాశక్తి - చాగలమర్రి
చాగలమర్రి పట్టణానికి చెందిన టిడిపి ఆర్యవైశ్య నాయకుడు తొమ్మండ్రు గురుకుమార్(57) ఆనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న రాష్ట్ర టిడిపి మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్‌బాష,టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి గుత్తి నర్సింహులు,నంద్యాల జిల్లా బిసి సెల్ స్పోక్ పర్సన్ సల్లానాగరాజు లు మృత దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు.సంతాపం తెలిపిన వారిలో టిడిపి నాయకులు కొలిమి షరీఫ్,వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి,కామిశెట్టి రమేష్,చాంద్‌భాష,నాగూరు,నూర్‌భాష ఉన్నారు.










