ప్రజాశక్తి-యంత్రాంగం కాకినాడ వైసిపి పాలనలో మహిళల ఆర్థికపరిస్థితి అధోగతిగా మారిందని మాజీ మేయర్, టిడిపి మహిళా జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి మినీ మేనిఫెస్తో మహిళా శక్తీతో భవిష్యత్తు గ్యారెంటీ పథకాల ప్రచారంలో భాగంగా కాకినాడ 34వ డివిజన్ బ్యాంకు పేటలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. వినూత్నంగా సిలిండర్ల నమూనాలు ప్రదర్శించారు. తాళ్లరేవు పిల్లంకలో సాగి బాబ్జిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశక్తి కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. జగ్గంపేట రూరల్ జె.కొత్తూరులో బద్ది సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఎస్‌విఎస్.అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లి రాజు, కంచుమర్తి రాఘవ, దాపర్తి సీతారామయ్య, సర్వసిద్ధి లక్ష్మణరావు, సుంకవిల్లి రాజు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ 11, 12 వార్డుల్లో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, కంటే జగదీష్ మోహన్,పైణ్ణి శ్రీనివాసరావు, సానిపిని వెంకటరావు, కాళ్ల రవీంద్ర, కురుకూరి సోమేశ్వరరావు, నిమ్మకాయల కిరణ్, గొర్రెల జయలక్ష్మి, గుడాల శంకర్ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ గంగనాపల్లిలో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ప్రచారం చేశారు. మట్టా ప్రకాష్ గౌడ్, సరదే నాగ హరినాథ్, ఎలగా లోవరాజు, పండూరి జయకృష్ణ, పంపన బుజ్జి, బజ్జ భవాని, సాంబశివరావు, దొమ్మేటి వెంకటరమణ, పడమటి వీరబాబు, దేవతా చల్మాజీ, నీల రాంబాబు, గంజా రాంబాబు, ఇళ్ల శ్రీను, పట్టెం వెంకటేష్, పెండెం శ్యామ్ గణేష్, కొమిరిశెట్టి నర్సింగరావు, టేకుమూడి శ్రీను, పిల్లి శ్రీధర్, పెమ్మాడి శ్రీను పాల్గొన్నారు.










