ప్రజాశక్తి-ఆలూరు
టిడిపి మేనిఫెస్టో వైసిపి పతనానికి నాంది అని మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఆలూరు ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ తెలిపారు. గురువారం ఆమె ఆలూరులో విలేకరులతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో 5 కోట్ల మంది ప్రజలకు గ్యారంటీ ఇస్తూ ఆరు పథకాలను ప్రవేశపెట్టడం, మరిన్ని పథకాలతో అసలైన మేనిఫెస్టోను చంద్రబాబు త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబు నాయుడు పాలనను కోరుకుంటున్నారని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో వైసిపి నాయకుల్లో వణుకు పుడుతోందని తెలిపారు. పాదయాత్రకు రోజురోజుకు ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టిడిపి కార్యకర్తలు సమిష్టిగా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. టిడిపి రాష్ట్ర నాయకులు నారాయణ, డాక్టర్ వెంకన్న, సర్పంచి మరకట్టు ఎల్లప్ప, జిల్లా నాయకులు నరసప్ప, భాస్కర్, కొమ్ము రామాంజి, నాగరాజు, సోమశేఖర్ నాయుడు, మండల కన్వీనర్ అశోక్ యాదవ్, ముద్దరంగ, గూళ్యం రామాంజినేయులు, కృష్ణ నాయుడు, రఘు రామిరెడ్డి, రమేష్, మహేష్, రాముడు, రంగయ్య, ఈరన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నేడు ఆలూరులో విస్తృత స్థాయి సమావేశం
పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం టిడిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సుజాతమ్మ తెలిపారు. నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, క్లస్టర్, బూత్ ఇన్‌ఛార్జీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు, హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ










