కేకును కట్ చేస్తున్న నసీర్ అహ్మద్, చుక్కపల్లి రమేష్
ప్రజాశక్తి - గుంటూరు లీగల్ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భ:గా ఏర్పాటు చేసిన కేకును టిడిపి తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నసీర్ అహ్మద్ కట్ చేశారు. కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కపల్లి రమేష్, శ్రీరాం రాజీవ్ ఆనంద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెవికె సురేష్, న్యాయవాదులు కట్టా కాళిదాసు, పారి బాబురావు, వేమూరి శ్రీనివాసరావు, వల్లూరి అనిల్‌కుమార్, కె.నారాయణ, కె.వరలక్ష్మి, బ్రహ్మేశ్వరరావు, దాసరి రవీంద్రబాబు, జి.అనురాధ, ఎం.సురేష్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.










