Jan 11,2023 22:23

  • వైసిపి తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాష్‌

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలపై పథకం ప్రకారం టిడిపి నేతలు దాడులకు పాల్పడ్డారని వైసిపి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్‌ అన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల అభివద్ధికి సీఎం జగన్‌ నిరంతరం కషి చేస్తున్నారని తెలిపారు. టిడిపి నేతల్లా మాయమాటలు చెప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై టిడిపి విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లోకి అబద్దాలు తీసుకెళ్లాలని ప్రత్నిస్తోందన్నారు. పథకం ప్రకారమే వాలంటీర్‌పై టిడిపి నేతలు దాడి చేశారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తూర్పు నియోజకవర్గ నేతలతో సమావేశమై దేవినేని అవినాష్‌ని గెలిపించాలని ప్రకటించినప్పటి నుంచి వారి కుట్రలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికలయ్యేదాకా కుట్రలకు పాల్పడుతారని, వీటిని ఎదుర్కొని తూర్పు నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగురవేస్తామని దేవినేని అవినాష్‌ తెలిపారు.