Oct 07,2023 21:03

వల్లూరు : కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

వల్లూరు : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు వల్లూరులో టిడిపి నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా మండల టిడిపి ఇన్‌ఛార్జి లేబాక నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, రాబోవు రోజుల్లో వైసిపి రాక్షస పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు సైతం లేని ఒక వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం ఉందన్నారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి శునకానందం పొందుతున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కె శ్రీనివాసులురెడ్డి, దర్శ వెంకట సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, మామిళ్ల చెన్నారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చిట్టిబాబు, బాలిరెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : నగరంలోని పోస్టాఫీసు వద్ద టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌. మాధవిరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా క్యాండిల్‌ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌. శ్రీనివాసరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్‌, పలువరు నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు.