Oct 07,2023 20:41

బొబ్బిలి: కోటలో కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న బేబినాయన

టిడిపి అధిష్టానం పిలుపు మేరకు 'కాంతితో క్రాంతి అనే కార్యక్రమాన్ని శనివారం రాత్రి పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొవ్వొత్తులతో టిడిపి నాయకులు నిరసన తెలిపారు. పలు చోట్ల టిడిపి నిరాహార దీక్షలు కొనసాగాయి.
ప్రజాశక్తి- కొత్తవలస:
'కాంతితో క్రాంతి' అనే నిరసన కార్యక్రమం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి కోళ్ల లలిత కుమారి ఆదేశాల మేరకు నిమ్మలపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్‌ గొంప సత్యవతి ఆధ్వర్యంలో చేపట్టారు. వేపాడ: మండల కేంద్రంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆదేశాలు మేరకు టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. డెంకాడ: మండల కేంద్రంలో టిడిపి నాయకులు కొవ్వొత్తుల నిరసన తెలిపారు. ఊడికలపేట గ్రామంలో శనివారం టిడిపి నాయకులు బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర రావు, నాయకులు పడాల చిన్నారావు, బూర సూరి బంగారి, బుగత రమణ, వెంకటరావు, చింతపల్లి రామునాయుడు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. రామభద్రపురం: శనివారం స్థానిక ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో 108 టెంకాయలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ రవ్వ ఈశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షుడు కరణం విజయ భాస్కరరావు, కార్యదర్శి చింతల చిన్నమ్మతల్లి, ఉపాధ్యక్షుడు పత్తిగుళ్ళ యోగినాయుడు, ఎంపిటిసిలు వసంతల తిరుపతి, పూడి రామినాయుడు, కనిమెరక వెంకటి పాల్గొన్నారు.గరివిడి: చీపురుపల్లిలో ఉన్న దుకాణాలుకు శనివారం బాబుతో నేను, కరపత్రాలను టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రౌతు కామునాయుడు, గవిడి నాగరాజు, హారతి సాహూ, జనసేన నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు, మీసాల నవీన్‌, మండల చంటి, సబ్బి సోనియా, రెడ్డి లక్ష్మణ రావు, రేగిడి వాసు, పిన్నింటి సన్యాసి నాయుడు, బుంగ మహేష్‌, లెంక లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: పట్టణంలోని ఆకుల డిపో వద్ద గొంప కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు, పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్‌ ఆవరణలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం శనివారం కొనసాగింది. ఈ దీక్షలలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్‌ బేబినాయన ఆధ్వర్యంలో శనివారం రాత్రి కోటలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. దీనికి ముందు అలజంగి గ్రామం నుండి టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు 150 మంది దీక్షలో పాల్గొని సంతకాల సేకరణ చేస్తూ దీక్ష కొనసా గించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, టిడిపి మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. భోగాపురం: భోగాపురంలో నేను సైతం బాబు కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్‌ కర్రోతు బంగార్రాజు, టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ సూచనలు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రామ పార్టీ అధ్యక్షులు బొడ్డ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్‌బాబు, కోరాడ సూర్య ప్రకాశరావు, పట్టా రామారావు, సంగం అప్పుడు, దుబ్బక గోపి పాల్గొన్నారు.విజయనగరం కోట: టిడిపి జిల్లా కార్యాలయం అశోక్‌బంగ్లా వద్ద చేపట్టిన నిరశన దీక్షలు 25వ రోజు శనివారం కొనసాగాయి. ఈ సందర్భంగా కొండకరకాం మాజీ ఎంపిటిసి కిలారి సూర్యనారాయణ, సుంకర పేట మాజీ సర్పంచ్‌ సుంకరి రామనాయుడు, మలిచర్ల నాయకులు టి.రామారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ఖండించారు. చంద్రబాబు నాయుడు విడుదలైన వరకు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని తెలిపారుకార్యక్రమంలో పైడిరాజు, శ్రీను, సుంకర పేట, మరిచర్ల, కొండకరకాంకు చెందిన టిడిపి నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నియంతత్వ పాలన
రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్సీ మీసాల గీత అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ కుప్పంలో ఏర్పాటు చేసిన టిడిపి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీకి వెళ్తాయని ప్రకటించిన నాటి నుంచి వైకాపా నాయకులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. శనివారం రాత్రి అశోక్‌ బంగ్లా వద్ద టిడిపి నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.