పోలీస్టేషన్‌లో ఉన్న నాయకులు
ప్రజాశక్తి-గుడ్లూరు :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకి పంపిన సందర్భంగా ఆందోళన చెందిన గుడ్లూరు కు చెందిన టిడిపి నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడంతో మండల టిడిపి అధ్యక్షులు జయనగర్ల నాగరాజు ,మద్దసాని కష్ణ ,చెన్నారెడ్డి మహేష్, రావూరి వేణుగోపాల్, పువ్వాడి వేణు తదితర నాయకుల్ని అరెస్టు చేసి విడుదల చేసినట్లు సిఐ సుబ్బారావు విలేకరులకు తెలిపారు.










