Sep 10,2023 23:56

ప్రజాశక్తి  - అద్దంకి
చంద్రబాబు అరెస్టు, రిమాండుకు నిరసనగా టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. పట్టణంలోని నామ్ రోడ్డు, నల్లవాగు, సింగరకొండ సమీపంలో రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాల టైర్లకు గాలి తీశారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించినందుకు టిడిపి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. న్యాయమూర్తి నిందుతులకు ఒక్కొక్కరికి రూ.50వేలు జరిమాన విధించి వ్యక్తిగత పూచి కత్తుపై విడుదల చేశారు.
యద్దనపూడి : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో ఇచ్చిన నిరసన పిలుపు మేరకు ముందు జాగ్రత్తగా ఆదివారం నలుగురు టిడిపి నాయకులను ఎస్‌ఐ హానోకు అరెస్టు చేసినట్లు తెలిపారు. టిడిపి నాయకులు కె సతీష్, తారక రామారావు, నాగేశ్వరరావు అరెస్టయ్యారు.