Aug 30,2023 00:03

ప్రజాశక్తి - భట్టిప్రోలు ( వేమూరు)
వేమూరు మండలం వెల్లబాడు గ్రామానికి చెందిన వెల్లబాటి సామ్యూల్ (70) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన పాస్టర్ కొత్తపల్లి అబ్రహం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. వేమూరు మండలం బూతుమిల్లి గ్రామానికి చెందిన చుక్కపల్లి గాంధీ (73) అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ఉన్నారు.