ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం మండలం దేశాయిపేట సాయినగర్‌కు చెందిన టిడిపి కార్యకర్త బొడ్డు నాగమల్లేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర కమిటీ ఆదేశాల మేరకు చీరాల టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని మృతుని కూతురు ఉమాదేవికి తన అనుచరుల ద్వారా అందజేశారు. నాగమల్లేశ్వరరావు భార్య అనురాధ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి తండ్రి ఇద్దరు మృతి చెందడంతో ఉమా దేవి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. డిప్లమా పూర్తి చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బంది కారణంగా సర్టిఫికెట్లు తీసుకోలేకపోయారు. సర్టిఫికెట్ తీసుకునేందుకు, ఉద్యోగ ప్రయత్నాలకు ఆర్థిక అవసరం ఉండటంతో ఆమెను ఆదుకునేందుకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాగాబత్తిన పోతురాజు, గుత్తి శివయ్య, బుద్ది దుర్గ, విజయ, సజ్జా రవి, బుద్ది బసవచారి, సజ్జా కోటి, పోలయ్య పాల్గొన్నారు.










