Oct 18,2023 23:43

టిడిపి, జనసేనల ఆత్మీయ సమావేశం

టిడిపి, జనసేనల
ఆత్మీయ సమావేశం
ప్రజాశక్తి - పలమనేరు
నియోజకవర్గంలోని గంగవరం మండలం గండ్రాజు పల్లి సమీపంలో గల ఇండిస్టియల్‌ పార్క్‌ (తాపసి గ్రానైట్స్‌ ) నందు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతంగా జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి తెలుగుదేశం జనసైనికులు ఆత్మీయ సమావేశం జరగడం గమనార్హం. 2024 ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డిని గద్దె దించడమే తమ ముందున్న లక్ష్యమని ఇరు పార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్‌, జనసేన రాష్ట్ర మహిళా నాయకురాళ్లు కీర్తన, సుభాషిణి, జిల్లా కార్యదర్శి దిలీప్‌, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్‌, కిషోర్‌ గౌడ్‌, నాగరాజు రెడ్డి, సోమశేఖర్‌ గౌడ్‌, ఆనంద్‌, పట్టణ అధ్యక్షులు బలరాంశెట్టి, జనసేన నియోజకవర్గ నాయకులు ఏవి బాబు, చైతన్య, నాగరాజు, హరీష్‌, మంజుల చంద్ర, శివకుమార్‌ తదితరులున్నారు.