Sep 20,2023 22:12

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి -పెనుకొండ : వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల అడ్రస్‌ గల్లంతు అవ్వడం ఖాయమని స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ అన్నారు. బుధవారం పట్టణంలోని భోగసముద్రం చెరువు కట్ట పై రూ.95 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువును వీక్షించేందుకు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో న్యాయస్థానాలపై కామెంట్స్‌ చేసిన టిడిపి నాయకులపై న్యాయస్థానాలు సుమోటోగా కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్‌ ఫరూక్‌, వైస్‌ఛైర్మన్లు సునీల్‌, జయశంకర్‌ రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.