Sep 13,2023 21:43

ఫొటో : నిరాహార దీక్ష చేపడుతున్న టిడిపి, జనసేన నాయకులు

టిడిపి, జనసేన నాయకుల దీక్ష
ప్రజాశక్తి-కలిగిరి : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉదయగిరి టిడిపి ఇన్‌ఛార్జి బొల్లినేని రామారావు ఆదేశాల మేరకు చెంచలబాబు ఆధ్వర్యంలో బుధవారం కలిగిరిలో మొదటిరోజు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చెంచలబాబు మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.10 లక్షల మంది ట్రైనింగ్‌ పొంది లక్ష మందికి పైగా నేరుగా ఉద్యోగాలు మిగిలిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించింది రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. ని
రసన కార్యక్రమానికి జనసేన మండల అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జనసైనికులు కోసూరి సునీల్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బిసిసెల్‌ అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర, టిడిపి మండల కన్వీనర్‌ బి.వెంకటకృష్ణారెడ్డి, కాకు మహేష్‌, బి.రామారావు, ఒ.మాల్యాద్రి, సిహెచ్‌ తాతయ్య, లెక్కల రాంబాబు, బొల్లినేని వెంకటసుబ్బయ్య, జయరామిరెడ్డి, వెంగప నాయుడు, మాదాల శ్రీనివాసులు, చంద్రమౌళి, వరప్రసాధ్‌ బొగ్గవరపు వేణు, తదితరులు పాల్గొన్నారు.