Nov 16,2023 23:28

ప్రజాశక్తి - అద్దంకి
టిడిపి, జనసేన మొదటి ఆత్మీయ సమావేశం గురువారం పోతురాజుగండిలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించారు. ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్, జనసేన కన్వీనర్ ఈదర హరిబాబుతోపాటు రెండు పార్టీల మండల కన్వీనర్లు హాజరయ్యారు. మన్నం త్రిమూర్తులు సభ ఆహ్వానం పలికారు. సమావేశానికి హరిబాబు అధ్యక్షత వహించారు. ఎంఎల్‌ఎ రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుపై మొదటిగా స్పందించి మద్దతు తెలిపిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు  అభినందనలు తెలిపారు. వైసిపి హామీలపై మడమ తిప్పి అమలు చేయకపోగా చెప్పినవన్నీ చేసినట్లు అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వాదులు, దళితులపై అక్రమ కేసులు బనాయిస్తూ, అవమానిస్తూ, హత్యాకాండలు చేస్తూ నియంత పాలనతో ముందుకెళ్తున్న వైసిపిపై ప్రతి ఒక్కరు తిరగబడి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈదర హరిబాబు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచే టిడిపి, జనసేన మైత్రి తప్పక అధికారం చేజెక్కించుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో గాడిదప్పిన పాలనను గాడిలో పెడతామని అన్నారు. సచివాలయ ఉద్యోగులు వైసిపి కార్యకర్తలుగా పనిచేస్తే తగినమోల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ, కరి పరమేష్, కుందారపు రామారావు, జనసేన మండల కన్వీనర్లు సందిపోగు వినోద్ కుమార్, చల్లా వెంకట కృష్ణారావు, ఐటి కోఆర్డినేటర్‌ కోటేశ్వరరావు, సాదు వెంకటేష్, కొట్టే నరసింహారావు, కసుకుర్తి వీర హనుమాన్, ఎం రామకోటేశ్వరరావు, గాదె రామాంజనేయులు, బత్తుల చంద్రశేఖర్, ఇమడా బత్తిన వెంకటేశ్వరరావు, చెవుల వెంకట్రావు, మేడ రేణు కోటేశ్వరరావు, అద్దంకి టిడిపి మండల కన్వీనర్లు కటారి నాగేశ్వరరావు, జాగర్లమూడి జయకృష్ణ, కొండేటి ఇజ్రాయిల్, చేవూరు వాసిరెడ్డి, మల్లెనేడి గోవిందరావు పాల్గొన్నారు.