Mar 20,2023 00:26
కేక్‌ కట్‌ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-దర్శి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరవేయడం వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు నాంది అని మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టిడిపి పరిశీలకులు నల్లపాటి రామచంద్రప్రసాద్‌ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్ధానాలు టిడిపి కైవసం చేసుకోవడాన్ని హర్షిస్తూ స్థానిక కార్యాలయంలో ఆదివారం కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చయ్య, టిడిపి మండల అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు, శివ కోటేశ్వరరావు, నెమిలయ్య, కూరపాటి శ్రీను, ఓబులరెడ్డి, పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, నాయకులు దారం సుబ్బారావు, శ్రీనివాసరావు, మధు, సందు రామయ్య, పౌలు, గోవిందరెడ్డి, బాలకృష్ణ, వీరనాగిరెడ్డి, వలి తదితరులు పాల్గొన్నారు.