ప్రజాశక్తి- శృంగవరపుకోట : టిడిపి వేపాడ మండల అధ్యక్షులు గొంప వెంకట రావు ఆద్వర్యంలో ఆదివారం 26వ రోజు పట్టణంలోని ఆకుల డిపో వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్ష శిబిరం వద్ద మహిళలలు కోలాటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేపాడ మండలం టిడిపి సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట, పుణ్యగిరి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ వద్ద టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా 26వ రోజు శాంతియుతంగా సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నల్ల బ్యాడ్జ్‌లు, కండువాలు ధరించి, మీతోనే మేము సైతం అంటూ చంద్రబాబునాయుడుకి మద్దతుగా సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపిపి రెడ్డి వెంకన్న ఒంటి కాలపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ నాయకులు పాల్గొన్నారు. భోగాపురం: మండలంలోని గుడివాడ, చెరుకుపల్లి, లింగాలవలస, పోలిపల్లి, కొత్త మరాడపాలెం, కవులవాడ పంచాయితీల్లో టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కవులవాడ ఎంపిటిసి కోరాడ పద్మ, క్లస్టర్ ఇన్‌చార్జ్ దాసరి అప్పలస్వామి, తెలుగుయువత అధ్యక్షులు సరగడ తోగులురెడ్డి, నాయకులు బుగత రామ్మోహన్, నర్సింహులు పాల్గొన్నారు.డెంకాడ: బాబుతో నేను కార్యక్రమాన్ని మండలంలో బంటుపల్లి గ్రామంలో ఆదివారం టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్టుల గురించి వివరించారు. మాజీ ఎంపిపి కందిచంద్రశేఖర రావు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, నాయకులు సంగం సురేష్, చిక్కాల శేషగిరి, రవి పాల్గొన్నారు. బొబ్బిలి: బొబ్బిలి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ బేబినాయన ఆధ్వర్యంలో బాడంగి మండలానికి సంబంధించి గజరాయని వలస గ్రామానికి చెందిన టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్ బాబు, బాడంగి మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు, సింగిరెడ్డి భాస్కరరావు, గజరాయనివలస సర్పంచ్ మూడడ్ల సత్తిబాబు, నగుడు సత్యం, తెర్లి కామునాయుడు, గుల్లిపల్లి రామినాయుడు, బొబ్బిలి మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










