ప్రజాశక్తి-డుంబ్రిగుడ:తెలుగుదేశం హయాంలోనే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. మండలంలోని గుంటసీమ పంచాయతీలో సోమవారం ఆయన పర్యటించారు. అనంతరం దొరగుడా, శోభూరు గ్రామాల్లో సందర్శించి గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం విస్మరించిందని, రుణమాఫీ గాలికి వదిలేసిందన్నారు.ప్రభుత్వం కాస్మోటిక్ పంపిణీ చేయలేని దుస్థితితో ఉందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సిసి రోడ్లు, తాగునీరు, వీధి రోడ్లు డ్రైనేజీలు కల్పిస్తామన్నారు. తొలగించిన రేషన్ కార్డులు, పింఛన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకుంటుందని విమర్శించారు. అనంతరం ఆ పంచాయతీ బిజెపి నాయకులు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు, పార్లమెంట్ కోశాధికారి నాగేశ్వరరావు, అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు సుబ్బారావు, టిఈఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి స్వామి, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు భాస్కరరావు, పంచాయతీ యువ నాయకులు జక్కయ్య పాల్గొన్నారు.










