ప్రజాశక్తి-డుంబ్రిగూడ: టిడిపి పార్టీ హయంలోనే గిరిజన గ్రామాల్లో అభివీద్ధి పనులు జరిగాయని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ చెప్పారు. మండలంలోని కొల్లపుట్టు పంచాయతీ చంపగూడ గ్రామంలో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం కనీసం గ్రామాలను పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారం చేపట్టకు ముందు పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను ఎవరు మర్చి పోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు, అరకు పార్లమెంట్ టిఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి స్వామి, అరకు పార్లమెంట్ కోశాధికారి నాగేశ్వరరావు, సర్పంచ్ పాండురంగస్వామి పాల్గొన్నారు.










