Jul 25,2023 20:44

- ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-పీలేరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలోనే బిసిలు అభివృద్ధి చెందారని ఆ సానీకట బిసి సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్‌ శివప్రసాద్‌నాయుడు అన్నారు. టిడిపి బిసి ఫెడరేషన్‌ అధ్యక్షులు కొల్లు రవీంద్ర పిలుపు మేరకు మంగళవారం మండలంలోని జాండ్ల పంచాయితీ, ఆవులయ్యగారిపల్లిలో టిడిపి బిసి సాధికారిక సమితి పాల ఏకిరి కమిటీ సభ్యుడు జ్యోత భాస్కర్‌ నాయుడు ఆధ్వర్యంలో పాల ఏకిరిలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ నాయుడు మాట్లాడుతూ బిసిల అభివద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బిసిల అభివద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ పథకాలన్నీ బిసిలకు నేరుగా దక్కేలా అన్ని చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం బిసిల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోకపోగా, ఉన్న అరకొరా పథకాలను కూడా వైసిపి నాయకులే అనుభ విస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బిసిలపై కపట ప్రేమ చూపెడుతూ నిధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. పాల ఏకిరులందరూ వచ్చే ఎన్నికల్లో నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్‌ కన్వీనర్‌ పులసర శివప్ప నాయుడు, చిత్తూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ మల్లూరు దేవి, స్టేట్‌ కోఆర్డినేటర్‌ జీవన్‌ కుమార్‌ నాయుడు, స్టేట్‌ డైరెక్టర్లు ఎం. వేణుగోపాల్‌ నాయుడు, బంగారు నారాయణస్వామి నాయుడు, కీరమంద శ్రీనివాసులు నాయుడు, రాగినేని రఘుపతి నాయుడు, మనిగే ఢిల్లీ భాస్కర్‌ నాయుడు, కమిటీ సభ్యుడు జీవి నాయుడు, కసినేని విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు.