ప్రజాశక్తి-కందుకూరు :రాష్ట్రం అభివద్ధి చెందాలన్నా , ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరముంద కందుకూరు పట్టణ తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ పేర్కొన్నారు. టిడిపి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కందుకూరు నియోజకవర్గంలో టిడిపి ఇన్ ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సూచన మేరకు నిర్విరామంగా కొనసాగుతోంది. అందులో భాగంగా గుడ్లూరు మండలం మోచర్లలో మహాశక్తి చైతన్య రథయాత్ర గురువారం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో, మహాశక్తి కరపత్రాలను మహిళలకు అందచేసి వివరించారు. రమణమ్మ , కందుకూరు నియోజకవర్గం అంగనవాడి , డ్వాక్రా గ్రూపుల అధ్యక్షురాలు సింగమనేని పద్మ , ముప్పారాజు హారిక , రావి సరిత, ఎండ్లూరి ఎస్తేరమ్మ ఉన్నారు.










