Jan 05,2023 23:59

జిఒ నెంబర్‌ 1 కాపీలను దగ్ధం చేస్తున్న గవిరెడ్డి, టిడిపి కార్యకర్తలు

ప్రజాశక్తి-దేవరాపల్లి
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించిందని మాడుగుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. బుధవారం మండలంలోని తామరబ్బా పంచాయతీ శివారు బొడ్డపాడు గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు. అనంతరం రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 1 కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి గోవింద, మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, టిడిపి నాయకులు శెరకాన సూర్యనారాయణ, బండారు సింహాద్రప్పుడు, మలిరెడ్డి రాజునాయుడు, రాయివరపు సాంబమూర్తి, జడ్డేటి పైడిరాజు, ముసలి తమ్మయ్య, ముక్తు ఈశ్వరరావు, వంతు నాయుడు, కిల్లి గోవింద, గొంతిన అప్పలనాయుడు, మహిళలు పాల్గొన్నారు.
కశింకోట : వైసిపి పాలనలో రాష్ట్రంలో గ్రామాలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోయాయని మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. కశింకోటలో రెండో రోజు గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కశింకోట గ్రామంలో వీధి దీపాలు వెలగకపోయిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే సభలకు అనుమతుల రద్దు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉగ్గిన రమణ మూర్తి, వేగి గోపీకృష్ణ, పెంటకోట రాము, సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, కాండ్రేగుల సతీష్‌, జగన్నాధం, పంచదార్ల సూరిబాబు, బొడ్డేడ బాలాజి, షేక్‌ బాబర్‌ పాల్గొన్నారు.