Jul 13,2023 21:50

      మండవల్లి:టిడిపి హాయంలో రాష్ట్రం అధోగతి పాలైందని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు(డిఎన్‌ఆర్‌) అన్నారు. మండవల్లి సచివాలయ పరిధిలో గురువారం నిర్వహించిన 'జగనన్న సురక్ష'లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవల్లిలో ఇల్లులేని నిరుపేదలను గుర్తించి భూమిని కొనుగోలు చేసి 290 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇల్లు నిర్మించుకునేలా చేశామన్నారు. 14 నెలలపాటు సాగిన జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు 99 శాతం అమలు చేసి అర్హులందరికీ ఇచ్చారని తెలిపారు. మిగిలిన ఒక శాతం అర్హులకు కూడా పథకాలను అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్‌, జెడ్‌పిటిసి సభ్యులు ముంగర విజయనిర్మల, వైస్‌ఎంపిపి ఎ.ఆదివిష్ణు, సర్పంచి మెండా జాన్సీ, ఉప సర్పంచి జొన్నలగడ్డ నాగలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : నూజివీడు పట్టణంలోని డిఎస్‌పి కార్యాలయ సమీపంలోని సచివాలయం వద్ద గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం జగన్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెవరూ ప్రవేశపెట్టలేదన్నారు.