Oct 05,2023 21:44

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి శ్రేణులు కలిసికట్టుగా సైనికుల్లా పనిచేసి టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తపై ఉందని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ''మేము సైతం- బాబుకోసం'' అన్న నినాదంతో జియ్యమ్మవలసలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాలు కలకాలం ఉండవన్నారు. యావత్తు టిడిపి నాయకులు పార్టీ విజయానికి కృషి చేయాలని మరోసారి కోరారు. కురుపాం నియోజకవర్గ ఇంచార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ తప్పుడు కేసులతో టిడిపి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లా రాంబాబు, అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్‌, నియోజకవర్గ మహిళ దాసరి జోతిర్మయి, అరుకు పార్లమెంట్‌ ఎస్‌టి సెల్‌ ప్రధానకార్యదర్శి నందివాడ కష్ణబాబు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రన శ్రీరామ్మూర్తి నాయుడు, అరుకు పార్లమెంట్‌ కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు ఎం.సత్యంనాయుడు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోల రంజిత్‌కుమార్‌, అరుకు పార్లమెంట్‌ కార్యవర్గ సభ్యులు ఎం.విజయాంకుశం, బిసి సెల్‌ ఉపాధ్యక్షులు అంబటి తవిటినాయుడు , గరుగుబిల్లి మండల టిడిపి ఉపాధ్యక్షులు గొర్లి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం చంద్రబాబుకు సంఘీభావంగా మండలంలోని గుచ్చిమిలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరు చంద్ర ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో టిడిపి మండల అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, కార్యదర్శి రౌతు వేణుగోపాల నాయుడు, పెద్దలు సాల హరిబాబు, పెద్దబ్బాయి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోకాళ్లపై నిల్చొని నిరసన
సీతంపేట : బాబుతో నేను రిలే నిరాహార దీక్షల్లో భాగంగా సీతంపేటలో టిడిపి నాయకులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, సీతంపేట మండల పార్టీ అధ్యక్షులు సవర తోట మొఖలింగం, బిసి సెల్‌ అధ్యక్షులు ఆర్‌.రంగనాధం, ఐటిడిపి కో-ఆర్డినేటర్‌ హిమరక పవన్‌, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు గంట సుధ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలో సుంకిలో మండల టిడిపి అధ్యక్షులు అక్కేన మధుసూదన్‌ రావు ఆధ్వర్యంలో నేను సైతం బాబు కోసం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎం.తవిటి నాయుడు, అంబటి రాంబాబు, ఎంబి విజయ అంకుశం, స్థానిక ఎంపిటిసి వై.శ్రీనివాసరావు, ఎం.రామారావు, బి.సత్యనారాయణ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.