Sep 28,2023 23:17

ప్రజాశక్తి - రేపల్లె
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే దీక్షలు గురువారం 15వ రోజుకు చేరాయి. ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో యాదవులు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. అధికార గర్వంతో మంచి వారిని హింశిస్తున్న రాక్షస మూకలు మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే వస్తున్నాయని అన్నారు. శిబిరం వద్దకు ఆవుని, శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో ఉన్న చిన్నారులను తీసుకువచ్చి వినూత్న రీతిలో చంద్రబాబుకు మద్దత్తు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, టీడీపీ నాయకులు అనగాని శివ ప్రసాద్, లీగల్ సెల్ నాయకులు వై ధర్మతేజ, వెనిగళ్ళ సుబ్రమణ్యం, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.