ప్రజాశక్తి-కందుకూరు :నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18 వ రోజుకు చేరాయి. కందుకూరు టిడిపి కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు వివిధవర్గాల ప్రజలు ప్రతిరోజూ తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. శనివారం దీక్షలో ఇంటూరి నాగేశ్వరరావుతోపాటు పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం పాల్గొన్నారు. దీక్ష ముగింపు సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ లాయర్లు, వ్యాపారులు, ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మహిళలు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నారన్నారు. రోజురోజుకు ఆయనకు సంఘీభావం తెలిపే వారి సంఖ్య పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు ని అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తున్నారన్నారు. దివి శివరాం మాట్లాడుతూ అప్పట్లో పులివెందుల ప్రాంతంలో వైఎస్ రాజారెడ్డి విచ్చలవిడిగా వ్యవహరిస్తూ, ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రత్యేకంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని, ఆయన మనవడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అదే బాటలో నడుస్తూ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకటసుబ్బారావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నాయకులు బండారు సోమరాజు, ఉమ్మనేని సుబ్బారావు, బాలమురళి, షేక్ మున్నా, షేక్ ఫిరోజ్, షేక్ రూబీ, షేక్ గౌస్ బాషా, షేక్ సలాం, బద్దిపూడి శిఖామణి మాని కొండ కొండయ్య, మాధవరావు, లక్ష్మీనరసింహం వెంకటరమణయ్య, పాతలపల్లి శ్రీనివాసరాజు, ఎస్.కె రహమతుల్లా, మాదాల చిరంజీవి, సూరే వినోద్ కుమార్ రెడ్డి, ఆళ్ల హరికష్ణారెడ్డి, కుర్రా శ్రీరాములు, చౌటూరి సుబ్బారావు, బొజ్జా శ్రీనివాసులు, యం.మల్లికార్జున, కత్తి ప్రసాద్, కత్తి నారాయణ, కత్తి వెంకట్రావు, అబ్రహం, మహిళా నాయకులు కల్లూరి శైలజ, కంసాని మయూరి, అశ్విని సుధారాణి, మానస, ద్రాక్షాయిని, రసూల్ బి ఉన్నారు.










