Oct 02,2023 00:06

మండపేటలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన న్యాయవాదులతో ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి - మండపేట
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన కేసులకు నిరసనగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆదివారం ఆలమూరు బార్‌ అసోసియేషన్స్‌ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు, టిడిపి లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కప్పల సునీల్‌కుమార్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ భారత రాజ్యాంగాన్ని తూట్లు పోడుస్తూన్నారన్నారు. రాజ్యాంగ సంస్థలైన పోలీస్‌ , సిఐడి వ్యవస్థలను నిర్వీర్యం చేసి జగన్‌ తన జేబు సంస్థలుగా మార్చుకున్నారన్నారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికి అక్రమమే అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, షేక్‌ సల్మాన్‌, న్యాయవాదులు వేగుళ్ల రామ్మోహన్‌ కుమార్‌, గుణ్ణం వీర వెంకట సత్యనారాయణ మూర్తి, నిమ్మలపూడి నారాయణమూర్తి, చుండ్రు ప్రకాష్‌, వి. వెంకట్రావు, అనసూరి గోవిందు పాల్గొన్నారు.
అమలాపురం టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఆదివారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను మెట్ల రమణ బాబు, పెచ్చేట్టి చంద్రమౌళి, అల్లాడి సోంబాబు ప్రారంభించారు. ఈ దీక్షలో ఎం.ఫణికుమార్‌, వై.కుమార్‌, పి.నర్సిబాబు, కె.రాము, ఎం.సుబ్రహ్మణ్యశర్మ, కె.రాజు, తదితరులు పాల్గొన్నారు.