Jul 07,2023 20:23

జంపాపురంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ చేసి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' అంటూ టిడిపి నాయకుల బస్సుయాత్ర బూటకపు మాటలతో చేపట్టడం హాస్యాస్పదమని, టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి ఎన్నిక కావడం ఖాయమని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని జంపాపురం గ్రామ సచివాలయంలో ఎంపిడిఒ రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వరంలో సర్పంచి ఆరోన్‌ అధ్యక్షతన రెండోరోజూ 'గడపగడపకు మన ప్రభుత్వం' చేపట్టారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఆదర్శమన్నారు. ఎస్‌ఐ రాజారెడ్డి, ఎంపిపి ఈరన్న, మండల వైద్యాధికారి అనురూప్‌, ఎంఇఒ నాగేశప్ప, ఎఇలు వీరేష్‌, శేఖర్‌ బాబు, ఎఒ రాజు, ఎపిఎం సత్యమ్మ, బెట్టనగౌడ్‌, శ్రీనివాస రెడ్డి, ఎన్‌.నాగరాజు, జగదీష్‌ స్వామి, జంపాపురం బసిరెడ్డి, బుళ్లి నరసింహులు, మల్లికార్జున గౌడ్‌, జొల్లయ్య, ఐరనగల్లు సర్పంచి రామాంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 23వ వార్డు సచివాలయంలో రెండోరోజూ 'గడపగడపకు' నిర్వహించారు. వైసిపి సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు.