ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని గొడిచెర్ల గ్రామం లో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ ఆధ్వర్యంలో పార్టీ క్లస్టర్ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు గ్రామాల్లో బాదుడే బాదుడు, రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లి వైసిపి పాలనను ఎండగట్టాలన్నారు.గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. అనంతరం రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కురందాసు నూకరాజు, దేవర సత్య నారాయణ, గింజాల లక్ష్మణరావు, వెలగా శ్రీనివా సరావు, నానేపల్లి రాఘవ, అప్పలరాజు, రమేష్, కృష్ణ ,దొరబాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.










