Oct 25,2023 21:53

చీపురుతో రోడ్డు ఊడ్చుతున్న టిడిపి నాయకులు

పుట్టపర్తి క్రైమ్‌ : పట్టణంలో టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ సత్యసాయిబాబా జయంతి వేడుకలు సమీపిస్తున్నా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు పనులు చేయలేదన్నారు. అందుకు నిరసనగా నాయకులతో కలిసి చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి బాబా జయంతి వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు ఆదినారాయణ రెడ్డి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రామాంజులు నాయుడు, నాయకులు రామాంజి, మూర్తి, గంగాద్రి, తదితర నాయకులు నాయకులు పాల్గొన్నారు.