Oct 14,2023 22:48


ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
మండలంలోని కాలేరు గ్రామంలో 'బాబుతో నేను' నిర్వహించిన ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసుల వివరాలను ప్రజలకు వివరించారు చంద్రబాబు ప్రకటించిన మ్యాని పెస్టోను ప్రజలకు వివరించి, కరపత్రాలను అందజేస్తూ టిడిపిని గెలిపించాలని కోరారు గ్రామంలో పర్యటించిన ఎంఎల్‌ఎను నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, ముత్యాల వెంకటరావు, పువ్వల చిట్టిబాబు, రెడ్డి ప్రసాద్‌, అల్లూరి రామకృష్ణ, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు రామచంద్రపురం మండలంలోని మాలపాడు గ్రామంలో బాబుతో నేను కార్యక్రమాన్ని టిడిపి ఇన్‌ఛార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బాబుతో నేను కార్యక్రమం పలు అభివృద్ధి అంశాల పైనా మాట్లాడారు. అనంతరం రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుబ్రహ్మణ్యానికి ఘన స్వాగతంపలికారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌ కొత్తపల్లి శ్రీను, నియోజకవర్గ ముఖ్య నాయకులు, గరికపాటిసూర్యనారాయణ, చింతపల్లి వీరభద్రరావు, మేడిశెట్టి రవికుమార్‌, కడియాల రాఘవన్‌, బలుసు శివప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్ఛార్జ్‌లు, యూనిట్‌ ఇన్ఛార్జ్లు, కార్యకర్తలలు పాల్గొన్నారు.