Oct 14,2023 23:24

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుకు మద్దతుగా టిడిపి ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శనివారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు.
కాకినాడ గాంధీపార్కులో గాంధీ విగ్రహానికి మాజీ మేయర్‌ సుంకర పావని ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బాబుతో నేను అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి బాబు చేసిన అభివృద్ధిపై కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్వతి, సత్య, గుజ్జు అనురాధ, ప్రసన్న, రిక్క లక్ష్మి, పెమ్మాడి సీత, టేకుమూడి అమల, రేలంగి వరలక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ, కాసులమ్మ పాల్గొన్నారు. కరప మండలం గురజనాపల్లిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్‌ చేయడమే కాక ఆయన ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుల్లిపల్లి శ్రీనివాస్‌, బుంగ సింహాద్రి, మట్ట ప్రకాష్‌ గౌడ్‌, గండి వెంకటేశ్వరరావు, పంపన కన్నారావు, పబ్నీడి చిన్నబాబు, కోట శ్రీను, కాకరపల్లి బుజ్జి, పులపకూర మహేష్‌, యలమంచిలి సుకుమార్‌, బొజ్జా భవాని సాంబశివరావు, యాసలపు కన్నా, నాగబాబు, ఊబ రాము, మేడిశెట్టి శివ పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరం, మూలపొలంలో ఇంటింంటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. పోలేకుర్రులో తోటపేట, యాదవ కాలనీ, బిసి పేటలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ (బాబి) మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మందాల గంగ సూర్యనారాయణ, దున్నా సుబ్రహ్మణ్యం, పాండురంగ, గౌతమ్‌, కాశీ, వేణుగోపాలరావు, సత్తికొండ, పితాని విష్ణు, సింహాచలం, చంటి, రోళ్ల చక్రవర్తి, మోర్త భైరవమూర్తి, జక్కల ప్రసాద్‌ బాబు, నిమ్మకాయల మూర్తి, రామకృష్ణ, చంద్రాల బుజ్జి, దున్నా సింహద్రి, వెంటపల్లి ఉమామహేశ్వరి పాల్గొన్నారు. పెద్దాపురం మండలం కట్టమూరులో టిడిపి యువజన నాయకుడు నిమ్మకాయల రంగనాగ్‌ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె.వెంకటశ్రీనివాసరావు, ఎలిశెట్టి నాని, నూనె రామారావు, అరవింద కుమార్‌, మొయిళ్ల కృష్ణమూర్తి, చాగంటి గోపాలకృష్ణ, గుత్తుల సూర్యావతి, నంది ఉమామహేశ్వరి, మేడిది శ్రీనివాస్‌, ఏలేటి సుబ్బారావు, గుత్తుల శ్రీనివాస్‌, పెట్లు వీరభద్రరావు పాల్గొన్నారు.