Oct 16,2023 00:37

నిరసన చేపడుతున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి -కొయ్యూరు: చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసన భాగంగా టిడిపి అధిష్టానం పిలుపుమేరకు 'న్యాయానికి సంకెళ్లు' ప్యాలెస్‌లో పిచ్చోడు జగన్‌ కుట్రలు దేశానికి చేటు అంటూ కొయ్యూరు దుర్గమ్మ ఆలయం వద్ద ఎంవివి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం టిడిపి శ్రేణులు మోకాళ్ళపై సంకెళ్లు వేసుకొని నిరసనలు చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంపై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టు సూచనలను పాటించాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో టిడిపి నేతలు అనిశెట్టి చిరంజీవి, సర్పంచ్‌ బాలరాజు, మేడిబోయిన చిన్న, ఉబల రాజేష,్‌ నాగేశ్వరరావు, నాగార్జున, ములకల సత్తిబాబు, వజ్రప,దేవుడు, నాని బాబు, వాసా రాము, రేవలు, అప్పన్న, బుజ్జిబాబు, శ్రీను, శివ, మణికంఠ పాల్గొన్నారు.